Sunday, March 26, 2006

భావయామి (bhavayami) ...

"భావయామి" అనగా భావం మీద ధ్యానం చేయడం. "భావయామి గోపాలబాలం" అనగా గోపాల బాలుడి నామం మీద ధ్యానం చేయడం. నాకు బాగా నచ్చిన అన్నమయ్య కీ్ర్తనలలో భావయామి గోపాలబాలం ఒకటి. ఇదిగో ఆ అన్నమయ్య కీర్తన:

కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు
రాగం: యమునా కళ్యాణి
తాళం: ఆది

భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా

కటి ఘటిత మేఘలా ఖచితమణి ఘంటికా పటల నినదేన విప్రాజమానం
కుటిల పద ఘటిత సంకుల సింజితే నతం చటుల నటనా సముజ్వల విలాసం

నిరతకరర కలిత నవనీతం బ్రహ్మాది సుర నికర భావనా షోభిత పదం
తిరువేంకటాచల స్తితం అనుపమం హరిం పరమ పురుషం గోపాలబాలం

నా తెలుగు బ్లాగు

నేను ఈ తెలుగు బ్లాగు మొదలు పెట్టినందుకు నాకు చాలా ఆనందంగా వుంది. ఇంతకు ముందు నేను నా మరొక బ్లాగులో తెలుగు/ఆంగ్లము కలిపి రాసేవాడిని. ఇప్పటినుంచి నా తెలుగు బ్లాగులు వేరుగా రాద్దామని అనుకుంటున్నా. ఈ బ్లాగులో నా తెలుగు భావాలను వ్యక్తం చేయటానికి ప్రయత్నిస్తా...