Monday, May 31, 2010

Annamayya Keerthanalu - వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha in Telugu)

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ

ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ

వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లగొలిపె నీ విష్ణుకథ

Annamayya Keerthanalu - నారాయణతే నమో నమో (Narayanate Namo Namo in Telugu)

నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమ పురుష భవబంధ విమోచన
నర మృగ శరీర నమో నమో

జలధి శయన రవిచంద్ర విలోచన
జలరుహ భవనుత చరణయుగ
బలిబంధన గోప వధూ వల్లభ
నలినో దరతే నమో నమో

ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర శ్రీ వేంకట నాయక
నాద ప్రియతే నమో నమో

Sunday, May 30, 2010

Annamayya Keerthanalu - అన్ని మంత్రములు (Anni Mantramulu in Telugu)

అన్ని మంత్రములు నిందే ఆవహించెను
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము

నారదుండు జపియించె నారాయణ మంత్రము
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుండు చేకొనె రామ మంత్రము
వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము

రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపియించె
నంగ వింవె కృష్ణ మంత్ర మర్జునుండును
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించె
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరా నాధుండె
గురి పన్నిన దిదియె పర బ్రహ్మ మంత్రము
నన్నుగావ కలిగె బో నాకు గురు డియ్యగాను
వెన్నెల వంటిది శ్రీ వేంకటేశు మంత్రము

Annamayya Keerthanalu - చందమామ రావో (Chandamama Ravo in Telugu)

చందమామ రావో జాబిల్లి రావో
మంచి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో

నగుమోము చక్కని యయ్యకు
నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి
జగమెల్ల నేలిన స్వామికి
ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల మురారి బాలునికి

తెలిదమ్మి కన్నుల మేటికి
మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకు
మా కతల కారి ఈ బిడ్డకు
కుల ముద్ధించిన పట్టెకు
మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి
నవ నిధుల చూపుల జూసే సుగుణునకు

సురల గాచిన దేవరకు
చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు
మా నీటు చేతల పట్టికి
విరుల వింటి వాని యయ్యకు
వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు
మా శ్రీ వేంకటేశ్వరునికి

Annamayya Keerthanalu - ఇందరికీ అభయంబు లిచ్చు చేయి (Indariki Abhayambu lichu Cheyi in Telugu)

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కల్కియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి
మొరసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి

పురసతుల మానముల పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి
తిరు వేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

Annamayya Keerthanalu - అదివో అల్లదివో (Adivo Alladivo in Telugu)

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ

Annamayya Keerthanalu - తందనాన అహి (Tandanana ahi in Telulgu)

తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా - తందనాన

బ్రహ్మ మొకటే పర - బ్రహ్మ మొకటే - పర
బ్రహ్మ మొకటే - పర బ్రహ్మ మొకటే

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర - అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
దిన మహోరాత్రములు - తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను - పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే

Saturday, May 29, 2010

Annamayya Keerthanalu - మనుజుడై పుట్టి (Manujudai Putti)

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన

అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన

Annamayya Keerthanalu - ఎక్కువ కులజుడైన (Ekkuva Kulajudaina)

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు

వేదములు చదివియును విముఖుడై
హరిభక్తి యాదరించని సోమయాజి కంటె
ఏదియును లేని కుల హీనుడైనను
విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు

పరమ మగు వేదాంత పఠన దొరికియు
సదా హరి భక్తి లేని సన్యాసి కంటె
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు

Annamayya Keerthanalu - కొండలలో నెలకొన్న (Kondalalo Nelakonna)

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు

కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద
గరుణించి తన యెడకు రప్పించిన వాడు
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు

Annamayya Keerthanalu - షోడశ కళానిధికి (Shodasa Kalanidhiki)

షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చెలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదే
సర్వ నిలయున కాసనము నెమ్మనిదే
అలగంగా జనకున కర్ఘ్య పాద్యాచమనాలు

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధ పుష్పధూపములు
తీర్ధమిదే కోటిసూర్య తేజునకు దినము

అమృత మధనునకు అదివో నైవేద్యము
గమి చంద్రనేత్రునకు గప్రవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో బ్రదక్షిణాలు దండములు నివిగో

Friday, May 28, 2010

శివాష్టకం (Sivaashtakam, Shivaashtakam, Shivashtakam in Telugu)

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే |

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలం
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే |

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే |

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం, మహేశం శివం శంకరం శంభు మీశానమీడే |

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే |

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భోజ నమ్రాయ కామం దదానమ్
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే |

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభు మీశానమీడే |

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభు మీశానమీడే |

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి |

శివ పంచాక్షరీ స్తోత్రం (Siva Panchakshari Stotram in Telugu)

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమశివాయ ||

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప పూజితాయ
తస్మై "మ" కారాయ నమశివాయ ||

శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ |
శ్రీ నీలకంఠాయ వృషభద్వజాయ
తస్మై "శి" కారాయ నమశివాయ ||

వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమశివాయ ||

యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ |
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమశివాయ ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే ||

చంద్ర శేఖరాష్టకం (Chandra Sekharashtakam, Chandrasekharashtakam in Telugu)

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ||

రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం
శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ |
క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౧

మత్తవారణ్ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం |
దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౨

కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం |
అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౩

పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహం |
భస్మదిగ్ద కళేబరం భవనాశనం భవ మవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౪

యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణమ్
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ |
క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణమ్
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౫

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం |
భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౬

విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం
సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినం |
క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౭

భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |
సోమవారిన భోహుతాశన సోమ పాద్యఖిలాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || ౮