Friday, June 04, 2010

Annamayya Keerthanalu - కట్టెదుర వైకుంఠము (Kattedura Vaikunthamu in Telugu)

Updated version is available at: http://www.vignanam.org/veda/annamayya-keerthanas-kattedura-vaikuntham-telugu.html.

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ

Annamayya Keerthanalu - మూసిన ముత్యాల కేలే (Moosina Mutyaalakele in Telugu)

మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి

భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి

Annamayya Keerthanalu - తిరువీథుల మెఱసీ దేవదేవుడు (Tiruveedhula Merasee DevaDevudu in Telugu)

తిరువీథుల మెఱసీ దేవదేవుడు
గరిమల మించిన సింగారములతోడను

తిరుదండేలపై నేగీ దేవుడిదె తొలునాడు
సిరుల రెండవనాడు శేషునిమీద
మురిపేన మూడోనాడు ముత్యాల పందిరి క్రింద
పొరినాలుగోనాడు పువు గోవిలలోను

గ్రక్కున నైదవనాడు గరుడునిమీద
యెక్కను ఆరవనాడు యేనుగుమీద
చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను
యిక్కువ దేరును హుఱ్ఱ మెనిమిదోనాడు


కనకపుటందలము కదిపి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
యెనసి శ్రీ వేంకటేశు డింతి యలమేల్‍మంగతో
వనితల నడుమను వాహనాలమీదను

Tyagaraja Keerthanalu - బంటు రీతి కొలువీయ వయ్య రామ (Bantu Reeti Koluveeyavayya Rama in Telugu)

బంటు రీతి కొలువీయ వయ్య రామ

తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ

రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

Tyagaraja Keerthanalu - సామజ వర గమన (Samaja Vara Gamana in Telugu)

సామజ వర గమన
సాధు హృత్ - సారసాబ్జు పాల
కాలాతీత విఖ్యాత

సామని గమజ - సుధా
మయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల
మామ్ పాలయ

వేదశిరో మాతృజ - సప్త
స్వర నాదా చల దీప
స్వీకృత యాదవకుల
మురళీవాదన వినోద
మోహన కర, త్యాగరాజ వందనీయ

Tyagaraja Keerthanalu - బ్రోవ భారమా (Brova Bharama in Telugu)

బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని

శ్రీ వాసుదేవ! అండ కోట్ల
కుక్షిని ఉంచుకోలేదా, నన్ను

కలశాంబుధిలో దయతో
అమరులకై, అది గాక

గోపికలకై కొండలెత్త లేదా
కరుణాకర, త్యాగరాజుని

Tyagaraja Keerthanalu - మరుగేలరా ఓ రాఘవా (Marugelara O Raghava in Telugu)

Please find an updated version of this at http://www.vignanam.org/veda/tyagaraja-keerthanas-marugelara-o-raghava-telugu.html


మరుగేలరా ఓ రాఘవా!

మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన

అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

Tuesday, June 01, 2010

దుర్గా సూక్తం (Durga Suktam in Telugu)

జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితా త్యగ్నిః ||

తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టా”మ్ |
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా” |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||

విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా తిపర్ షి |
అగ్నే అత్రివన్మనసా గృణానో” స్మాకం బోధ్యవితా తనూనా”మ్ ||

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థా”త్ |
స నః పర్ షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితా త్యగ్నిః ||

ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి’ |
స్వాంచా” గ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||

గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవే”ంద్ర విష్ణోరనుసంచరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి |
తన్నో దుర్గిః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

శ్రీ సూక్తం (Sri Suktam, Sree Suktam)

హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం|
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీ''మ్ |
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ ||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్ |
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ ||

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ |
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ||

ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః |
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ |
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే ||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్ |
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ ||

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్ |
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ ||

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి |
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః ||

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ |
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ ||

ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే |
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్ |
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ ||

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్ |
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్ ||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి |
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||