Thursday, October 19, 2006

Roju Vaari Stotramulu: Monday-Chandrasekharashtakam -- చంద్రశేఖరాష్టకం


 1. చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర పాహిమాం
  చంద్ర శేఖర! చంద్ర శేఖర! చంద్ర శేఖర రక్షమాం


 2. రత్నసాను శరాశనం రజతాద్రి శృంగ నికేతనం
  శింజినీకృత పన్నగేశ్వర మంబుజాసన సాయకం
  క్షిప్ర దగ్ధ పురత్రయం త్రిదశాలయై రభివందితం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 3. పంచ పాదప పుష్ప గంధ పదాంబుజ ద్వయశోభితం
  ఫాల లోచన జాత పావక దగ్ధ మన్మధ విగ్రహం
  భస్మ దిగ్ధ కళేబరం భవ నాశనం భవ మవ్యయం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 4. మత్త వారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం
  పంక జాసన పద్మ లోచన పూజితాంఘ్రి నరోరుహం
  దేవ సింధు తరంగ శీకర సిక్త శుభ్ర జటాధరం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 5. యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం
  శైల రాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం
  క్ష్వేడ నీల గళం పరశ్వధ ధారిణం మృగ ధారిణం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 6. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృష వాహనం
  నారదాది మునీశ్వర స్తుత వైభవం వృష వాహనం
  అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 7. భేషజం భవ రోగిణా మఖిలా సదా మపహారిణం
  దక్ష యజ్న వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
  భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 8. భక్త వత్సల మర్పితం నిధి మక్షయం హరిదంబరం
  సర్వభూత పతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం
  సోమవారిణి భూహుతాశన సోమపానిల భాకృతిం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 9. విశ్వ సృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం
  సంహరం తమపి ప్రపంచ మశేష లోక వినాశినం
  క్రీడయంత మహర్నిశం గణనాధ యూధ సమన్వితం
  చంద్ర శేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః


 10. మృత్యుభీత మృకండు సూనుకృత స్తవం శివ సన్నిధౌ
  యత్ర కుత్ర చయః పఠేన్న హితస్య మృత్యు భయం భవేత్
  పూర్ణ మాయుర రోగతా మఖిలార్ధ సంపద మాదరం
  చంద్రశేఖర ఏవ తస్యదదాతి ముక్తి మయత్నతః

Roju Vaari Stotramulu: Sunday-Suryashtakam -- సూర్యాష్టకం

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Wednesday, October 18, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Kana kana ruchiraa -- కన కన రుచిరా

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: వరాళి
తాళం: ఆది

కన కన రుచిరా
కనక వసన నిన్ను

దిన దినమును అనుదిన దినమును
మనసున చనువున నిన్ను
కన కన రుచిర కనక వసన నిన్ను

పాలుగారు మోమున
శ్రీయపార మహిమ కనరు నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

బాలాకాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వర కపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ
కన కన రుచిరా కనక వసన నిన్ను

సపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల
చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖియింపగ లేదా యటు
కన కన రుచిరా కనక వసన నిన్ను

మృదమద లలామ శుభానిటిల వర జటాయు మోక్ష ఫలద
పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి
వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస విహారాప్త
సురభూజ మానిత గుణాంక చిదానంద ఖగ తురంగ ధృత రథంగ
పరమ దయాకర కరుణారస వరుణాలయ భయాపహర శ్రీ రఘుపతే
కన కన రుచిరా కనక వసన నిన్ను

కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొను
వాడు సాక్షి రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి
మరియు నారద పరాశర శుక శౌనక పురంధర నగజా ధరజ
ముఖ్యులు సాక్షి గాదా సుందరేశ సుఖ కలశాంబుధి వాసా శ్రితులకే
కన కన రుచిరా కనక వసన నిన్ను

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత
ముఖజిత కుముదహిత వరద నిన్ను
కన కన రుచిరా కనక వసన నిన్ను

కన కన రుచిరా

Saturday, October 14, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Duduku gala -- దుడుకు గల

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: గౌళ
తాళం: ఆది

దుడుకు గల నన్నే దొర

కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు
దుడుకు గల నన్నే దొర

శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర
దుడుకు గల నన్నే దొర

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన
దుడుకు గల నన్నే దొర

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల నన్నే దొర

పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొర

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొర

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొర

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన
దుడుకు గల నన్నే దొర

చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన
దుడుకు గల నన్నే దొర

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక
నారాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు
దుడుకు గల నన్నే దొర

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర

Friday, October 13, 2006

Tyagaraja Pancharatna Keerthanalu: Jagadaananda Kaarakaa -- జగదానంద కారకా

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: నాట్టై
తాళం: ఆది

జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల జగదానంద కారకా

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
జగదానంద కారకా

నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
జగదానంద కారకా

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద కారకా

పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారకా

సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
జగదానంద కారకా

సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
జగదానంద కారకా

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారకా

కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
జగదానంద కారకా

పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
జగదానంద కారకా

అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

Tyagaraja Pancharatna Keerthanalu: Saadhinchene (Samayaaniki tagu maatalaadene) -- సాధించెనే

కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: ఆరభి
తాళం: ఆది

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
సాధించెనే ఓ మనసా

సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగించినటు
సమయానికి తగు మాటలాడెనే

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
సమయానికి తగు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడెనే

సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు
సమయానికి తగు మాటలాడెనే

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
సమయానికి తగు మాటలాడెనే

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన
పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన
సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను
సమయానికి తగు మాటలాడెనే

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
సమయానికి తగు మాటలాడెనే

సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
సాధించెనే ఓ మనసా.. సాధించెనే