కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: నాట్టై
తాళం: ఆది
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా
గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల జగదానంద కారకా
అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
జగదానంద కారకా
నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
జగదానంద కారకా
ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద కారకా
పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారకా
సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
జగదానంద కారకా
సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
జగదానంద కారకా
ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారకా
కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
జగదానంద కారకా
పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
జగదానంద కారకా
అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment