Monday, March 30, 2009

భజ గోవిందం (Bhaja Govindam in Telugu Script)

౧.
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి దుక్రింకరణే

౨.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం

౩.
నారీ స్తనభర నాభీదేశం
దృష్త్వా మాగా మోహావేశం
ఏతన్మాంస వసాదివికారం
మనసి విచింతయా వారం వారం

౪.
నళినీ దళగత జలమతి తరళం
తద్వజ్జీవిత మతిశయ చపలం
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం
లోకం శోకహతం సమస్తం

౫.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే

౬.
యావత్ పవనో నివసతి దేహే
తావత్ పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే

౭.
అర్ధమనర్ధం భావయ నిత్యం
నాస్తి తతః సుఖ లేశః సత్యం
పుత్రాదపి ధన భాజాం భీతిః
సర్వత్రైషా విహితా రీతిః

౮.
బాల స్తావత్ క్రీడాసక్తః
తరుణ స్తావత్ తరుణీసక్తః
వృద్ధ స్తావత్ చిన్తాసక్తః
పరమే బ్రహ్మణి కోపి న సక్తః

౯.
కా తే కాన్తా కస్తే పుత్రః
సంసారో అయమతీవ విచిత్రః
కస్య త్వం వా కుత ఆయాతః
తత్వం చిన్తయ తదిహ భ్రాతః

౧౦.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చల తత్వం
నిశ్చల తత్వే జీవన్ముక్తిః

౧౧.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః

౧౨.
మా కురు ధన జన యౌవన గర్వం
హరతి నిమేషాత్ కాలః సర్వం
మాయామయమిదం అఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా

౧౩.
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిర వసంతౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్చత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః

౧౪.
ద్వాదశ మంజరికాభిర శేషః
కథితో వైయా కరణస్యైషః
ఉపదేశో భూద్ విద్యానిపుణైః
శ్రీమచ్చంకర భగవచ్చరణైః

౧౫.
కాతే కాన్తా ధన గత చిన్తా
వాతుల కిం తవ నాస్తి నియంతా
త్రిజగతి సజ్జన సంగతి రైకా
భవతి భవార్ణవతరణే నౌకా

౧౬.
జటిలో ముణ్డే లుంజిత కేశః
కాషాయాంబర బహుకృత వేషః
పశ్యన్నపి చ న పశ్యతి మూఢః
ఉదర నిమిత్తం బహుకృత వేషః

౧౭.
అంగం గళితం పలితం ముణ్డం
దశన విహీనం జాతం తుణ్డం
వృద్ధో యాతి గృహీత్వా దణ్డం
తదపి న ముంచత్యాశా పిణ్డం

౧౮.
అగ్రే వహ్నిః పృష్ఠే భానుః
రాత్రౌ చుబుక సమర్పిత జానుః
కరతల భిక్షస్తరుతల వాసః
తదపి న ముంచత్యాశా పాశః

౧౯.
కురుతే గంగా సాగర గమనం
వ్రత పరిపాలనమథవా దానం
జ్ఞాన విహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మ శతేన

౨౦.
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతల మజినం వాసః
సర్వ పరిగ్రహ భోగః త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః

౨౧.
యోగరతో వా భోగరతోవా
సంగరతోవా సంగ విహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ

౨౨.
భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికా పీతా
సకృదపి యేన మురారీ సమర్చా
క్రియతే తస్య యమేన న చర్చా

౨౩.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహు దుస్తారే
కృపయాపారే పాహి మురారే

౨౪.
రథ్యా చర్పట విరచిత కన్థః
పుణ్యాపుణ్య వివర్జిత పన్థః
యోగీ యోగ నియోజిత చిత్తో
రమతే బాలోన్మత్త వదేవ

౨౫.
కస్త్వం కోహం కుత ఆయాతః
కామే జననీ కో మే తాతః
ఇతి పరిభావిత నిజ సంసారః
సర్వం త్యక్త్వా స్వప్న విచారః

౨౬.
త్వయి మయి సర్వత్రైకో విష్ణుః
వ్రర్థం కుప్యసి మయ్యసహిష్ణుః
భవ సమ చిత్తః సర్వత్ర త్వం
వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం

౨౭.
కామం క్రోధం లోభం మోహం
తక్త్వాత్మానం పశ్యతి సోహం
ఆత్మ జ్ఞ్నాన విహీనా మూఢాః
తే పచ్యన్తే నరక నిగూఢాః

౨౮.
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీన జనాయ చ విత్తం

౨౯.
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ
మా కురు యత్నం విగ్రహ సంధౌ
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్ సృజ భేదాజ్ఞ్నానం

౩౦.
సుఖతః క్రియతే కామాభోగః
పశ్చాద్దన్త సరీరే రోగః
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం

౩౧.
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేక విచారం
జాప్య సమేత సమాధి విధానం
కుర్వ వధానం మహదవధానం

౩౨.
గురు చరణామ్భుజ నిర్భర భక్తః
సంసారా దచిరాద్భవ ముక్తః
సేన్దియ మానస నియమా దేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం

౩౩.
మూఢః కశ్చిన వైయాకరణో
డుకృణ్కరణాధ్యయన ధురీణః
శ్రీమచ్చంకర భగవచ్చిష్యైః
బోధిత ఆసీచ్చోదిత కరణైః

8 comments:

యామజాల సుధాకర్ said...

ధన్యవాదములు. మొన్న ఎప్పుడో యుట్యూబ్ లో వెదుకుతన్నప్పుడు భజగోవిందం వీడియో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ తో దొరికింది. ఎందుకో ఇక్కడ షేర్ చేద్దామనిపించింది.

http://www.youtube.com/watch?v=r4FUQxn4CnY

Srinivas Vadrevu said...

ధన్యవాదములు సుధాకర్ గారూ...

Anonymous said...

meeru bhaktula
ru working still , is ur age is252 or 25

javacup said...

శ్రీనివాస్ గారు,
నమస్కారం. మీ గ్రాడ్యుఏషన్ సందర్భముగా శుభాకాంక్షలు.
నా పేరు కళ్యాణ్ చక్రవర్తి . నేను కొన్ని నెలల క్రితం మన హిందూ సంప్రదాయం గురించి చదువుతూ గూగుల్ లో వెతుకుతూంటే మీ బ్లాగ్ లో ఉన్న మీ ఆలోచలనలు చదవటం అయ్యింది. మీ బ్లాగ్ చాలా రోజులు చదివి ఆనందించాను. అప్పుడే మీకు ఒక మెయిల్ పంపిద్ద్దం అనుకోని దాని సంగతి కాల ప్రభావాంలో మరిచిపోయాను. ఈరోజు నాకు కొత్తగా పరిచయం అయిన ఒక ఆయనతో మాట్లాడుతూ మీరు గుర్తుకు వచ్చారు. ఆయన ఈ వేసవి సెలవలులో పిల్లలికి మన హిందూ సంప్రదాయం గురించి కొన్ని వర్క్ షాప్స్ నిర్వహిద్దాం అనుకొంటున్నారు. ఆయన ఉండేది ఫీనిక్స్, ఆరిజోనా లో. నీను ఉండేది టుసాన్, ఆరిజోనా లో.

మీరు ఇంకా ఫీనిక్స్ లోనే ఉంటున్నారా? నా ఈమెయిలు kdasika at gmail

- Kalyan

A Telugu Guy said...

చాలా థాంక్స్ సార్.
మీ బ్లాగ్ నాకు చాలా బాగా నచ్చింది

venugopal said...

Thanks a lot sir

venugopal said...

Do you have song for the whole lyrics

Unknown said...

Om namah shivaya