Thursday, January 22, 2009

విశ్వనాధాష్టకం (Viswanadha Ashtakam, Viswanadhaashtakam, Viswanadhashtakam)

గంగా తరంగ రమణీయ జటా కలాపం
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (1)

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (2)

భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (3)

సీతాంశు శోభిత కిరీట విరాజమానం
బాలేక్షణాతల విశోషిత పంచబాణం
నాగాదిపా రచిత బాసుర కర్ణ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (4)

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (5)

తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
ఆనంద కందమపరాజిత మప్రమేయం
నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (6)

ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
ఆధాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాధం (7)

రాగాధి దోష రహితం స్వజనానురాగం
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
వారాణసీ పురపతిం భజ విశ్వనాధం (8)

వారాణసీ పుర పతే స్థవనం శివస్య
వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం (9)

విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

4 comments:

Unknown said...

ప్రియమైన శ్రీనివాస్ గారు

బహు చక్కని కీర్తనలు సేకరించి మాకు అందించిన మీరు నిజంగా ధన్య జీవులు.

ఒక చిన్నవిన్నపం:
వచ్చిరాని కాదు లేని సంగీత పరిజ్ఞానం తో ఈ కీర్తనలను పాడే ప్రయత్నం లో అవి కీర్తనలు గా కాక వాచక రూపం లో అపబ్ర్హంసం చెందుతూ, మా మీద మాకే విరక్తి కలిగిస్తున్నాయి. అందుచేత దయచేసి కొద్దిగా ఓపిక, తీరిక తెచ్చుకొని ఆడియో లింక్ కూడా కీర్తనలతో పాటు పెడితే, అది వింటూ, ఈ కీర్తనలని చదువుకుని తరిస్తామని మనవి.

సరవీజన సుఖినోభవంతు...
సదా కృతజ్ఞలతో
భవదీయుడు
గోపి

Anonymous said...

Dear Srinivas garu,

good contribution which guides every hindu towards spiritual goal spread
the same.

regards
mohan kumar

varalakshmi prasanna said...

good to have all these telugu devotional ....
pls also add to this
emi sethura linga..... which i like it very much if possible please in telugu lyrics....

bharadwaj said...

thaanq very much for ur service,
bharadwaj