Sunday, May 30, 2010

Annamayya Keerthanalu - అదివో అల్లదివో (Adivo Alladivo in Telugu)

అదివో అల్లదివో శ్రీ హరి వాసము
పదివేల శేషుల పడగల మయము

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడు డదె మొక్కు డానందమయము

చెంగట నదివో శేషాచలమూ
నింగి నున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము

కైవల్య పదము వేంకట నగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో
పావనముల కెల్ల పావన మయమూ

No comments: