Saturday, May 29, 2010

Annamayya Keerthanalu - షోడశ కళానిధికి (Shodasa Kalanidhiki)

షోడశ కళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చెలును సమర్పయామి

అలరు విశ్వాత్మకున కావాహన మిదే
సర్వ నిలయున కాసనము నెమ్మనిదే
అలగంగా జనకున కర్ఘ్య పాద్యాచమనాలు

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే
సరి శ్రీమంతునకు భూషణము లివే
ధరణీధరునకు గంధ పుష్పధూపములు
తీర్ధమిదే కోటిసూర్య తేజునకు దినము

అమృత మధనునకు అదివో నైవేద్యము
గమి చంద్రనేత్రునకు గప్రవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో బ్రదక్షిణాలు దండములు నివిగో

1 comment:

Dr.Suryanarayana Vulimiri said...

శ్రీనివాస్ గారు, ఈ కీర్తనలో కొన్ని దిద్దుబాట్లు చేయగలరు. మొదటి చరణంలొ రెండవ లైను లో "నెమ్మనిదే" కు బదులు "నెమ్మినిదే" గ ఉండాలి. ఈ చరణంలొ నాలుగవ లైను మిస్ అయింది. అది "జలధి శాయికిని మజ్జనమిదే". రెండవ చరణం మొదటి లైనులో "వస్తా" ను "వస్త్రా" గాను, నాలుగవ లైనులో "తీర్థమెదే" ను "తిరమిదే" గా దిద్దాలి. అలాగే మూడవ చరణం లో "గప్రవిడెము" కు బదులు "గ (క) ప్పుర విడెము" గ ఉండాలి.