Saturday, May 29, 2010

Annamayya Keerthanalu - ఎక్కువ కులజుడైన (Ekkuva Kulajudaina)

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు

వేదములు చదివియును విముఖుడై
హరిభక్తి యాదరించని సోమయాజి కంటె
ఏదియును లేని కుల హీనుడైనను
విష్ణు పాదములు సేవించు భక్తుడే ఘనుడు

పరమ మగు వేదాంత పఠన దొరికియు
సదా హరి భక్తి లేని సన్యాసి కంటె
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు

No comments: